ఈ సారి ఖైరతాబాద్‌ గణేశుడి ఎత్తు 9 అడుగులే!

ఖైరతాబాద్‌ మహాగణపతికి హైదరాబాద్‌ నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహం ఎత్తు, రూపంలోనే ...

Published : 06 Aug 2020 00:42 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతికి హైదరాబాద్‌ నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహం ఎత్తు, రూపంలోనే కాకుండా.. ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకూ భారీ సంఖ్యలో భక్తుల కోలాహలంతో ఇక్కడ ప్రతి రోజూ ఎంతో సందడిగా ఉంటుంది. అయితే ప్రతి ఏడాది భారీ వినాయకుడిని ప్రతిష్ఠించే గణేశ్‌ మండప నిర్వాహకులు కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈసారి 9 అడుగుల ఎత్తు ఉండే విగ్రహం ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ మేరకు విగ్రహ తయారీ మొదలు పెట్టేందుకు అర్చకులు ఇవాళ తొలి పూజ నిర్వహించారు. ఈ ఏడాది శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి రూపంలో లంబోదరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సారి 9అడుగుల ఎత్తు ఉండే మట్టి గణపతిని తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. విగ్రహానికి కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతి దేవిని ప్రతిష్ఠించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేయనున్నట్లు చెప్పారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. దర్శనం కోసం భక్తులు ఎవరూ రావొద్దని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని