
Updated : 25 Dec 2020 23:34 IST
శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం
తిరుమల: శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. భక్తులు శుక్రవారం సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.4.3కోట్లు ఆదాయం లభించింది. ఈ నెలలో ఇప్పటికే ఐదు పర్యాయాలు హుండీ ఆదాయం రూ.3కోట్లు దాటిన విషయం తెలిసిందే. అదే సమయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని రికార్డు స్థాయిలో 42వేల వరకు భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని గురువారం 31,475 మంది దర్శించుకున్నారు. స్వామివారికి 11,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.79 కోట్లు లభించింది.
ఇవీ చదవండి
నవ వైకుంఠం.. యాదాద్రిక్షేత్రం..!
బోనస్ అని చెప్పి ఉద్యోగులకు షాక్
Tags :