Tirumala: తిరుమలను కమ్మేసిన పొగమంచు.. పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గం మూసివేత

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల (Tirumala)ను పొగమంచు కమ్మేసింది.

Updated : 15 Dec 2023 19:34 IST

తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల (Tirumala)ను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొగమంచు, వర్షంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్‌రోడ్లలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చలితీవ్రత బాగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షంలో తడుస్తూ గదులకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ కూడా పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పొగమంచు, వర్షం నేపథ్యంలో సొంత వాహనాల్లో ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వారిని అలిపిరి వద్ద తితిదే (TTD) సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్‌రోడ్లలో రహదారి మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వెళ్లాలని సూచిస్తున్నారు. పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా తితిదే మూసివేసింది. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను శుక్రవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు