TTD: ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత: తితిదే

సూర్య,చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి.

Published : 12 Oct 2022 01:12 IST

తిరుమల: సూర్య,చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు తితిదే తెలిపింది. సూర్యగ్రహణం రోజు ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు, చంద్రగ్రహణం రోజు  ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నామని పేర్కొంది. గ్రహణాల రోజుల్లో బ్రేక్‌, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశామని.. కేవలం సర్వదర్శనం భక్తుకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని తితిదే వెల్లడించింది. గ్రహణాల సమయంలో అన్నప్రసాద పంపిణీ సైతం నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని