Updated : 03 Nov 2021 13:06 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. China: చైనా చేజేతులారా చేసుకొంది..!

‘శీతాకాలంలో ఆహార కొరత రావచ్చు.. ఇళ్లల్లో నిల్వలు పెంచుకోండి’ ‘ఎవరైనా బింజ్‌ (ఎక్కువగా తిండితినే) వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తే శిక్షిస్తాం’ ఇదేదో ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్‌ ఉన్‌ ఆదేశాలు కాదు.. ఆర్థిక శక్తిలో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా పాలకుల ఆదేశాలు. కొవిడ్‌, శీతాకాలం దృష్ట్యా ఇలా చేస్తున్నాం అని వారు చెబుతున్నారు.  వాస్తవానికి  దేశ పాలకుల చిన్నచిన్న తప్పుడు నిర్ణయాలు పెను సంక్షోభాన్ని ఎలా సృష్టిస్తాయో కొవిడ్‌ వ్యాప్తితో ప్రపంచం తెలుసుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Vinisha Umashankar: నేను పుడమి పుత్రికను.. గ్లాస్గోలో గర్జించిన వినీశా

‘‘మీ అబద్ధపు హామీలు వినివినీ మా తరం విసిగిపోతోంది. మీపై కోపం వస్తోంది. కానీ అందుకు నా దగ్గర టైం లేదు. మీరు చేయలేకపోయినా కనీసం మేమైనా మా భవిష్యత్తును నిర్మించుకోవాలి కదా. ప్రపంచ నేతలారా దయచేసి మాతో కలిసి రండి’’.. మారుతున్న వాతావరణ పరిస్థితులపై తన ఆవేదన వెళ్లగక్కింది 14ఏళ్ల వినీశా ఉమాశంకర్‌. గ్లాస్గో వేదికగా జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు(కాప్‌26)లో ఈ భారతీయ బాలిక చేసిన ప్రసంగం.. యావత్‌ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Israel PM: మా పార్టీలో చేరండి.. మోదీని కోరిన ఇజ్రాయెల్‌ ప్రధాని

3. Eatala Rajendar: హుజూరాబాద్‌ ప్రజలు ఆత్మను ఆవిష్కరించారు: ఈటల

ఎన్ని రకాల ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా హుజూరాబాద్‌ ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేశారని ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప ఎన్నికలో ప్రజలు తమ గుండెను చించి ఆత్మను ఆవిష్కరించారని.. గొప్ప మెజారిటీ తనకు అందించారని చెప్పారు. ఏడో సారి ఎమ్మెల్యేగా తనను గెలిచిపించారని.. ఏం చేసినా హుజూరాబాద్‌ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. T20 World Cup: అఫ్గాన్‌తో తస్మాత్‌ జాగ్రత్త.. ఏమరుపాటు వహిస్తే షాక్‌ తప్పదు

వరుసగా రెండు ఓటములు.. భారత జట్టుకు  కష్టాలను తెచ్చిపెట్టాయి. టీ20 ప్రపంచకప్‌ కొట్టాలనే అభిమానుల ఆకాంక్షను పక్కన పెడితే.. నాకౌట్‌ దశకైనా చేరాలనే ఆశలూ సంక్లిష్టంగా మారాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల చేతిలో టీమిండియా ఓటమిపాలైన విషయం విదితమే. గ్రూప్‌ దశలో ఇక మిగిలింది మూడే మ్యాచులు.. అఫ్గాన్‌ (నవంబర్ 3), స్కాట్లాండ్ (నవంబర్ 5), నమీబియా (నవంబర్ 8)తో తలపడనుంది. మూడింట్లోనూ టీమ్‌ఇండియా విజయం సాధించినా.. ఇతర జట్ల ఫలితాలపైనే మన నాకౌట్‌ భవితవ్యం ఆధారపడి ఉండటం శోచనీయం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Anushka Sharma: అనుష్క శర్మ.. 88 బంతుల్లో 52 పరుగులు

5. WhatsApp: వాట్సాప్‌లో మూడు కొత్త ఫీచర్లు.. డెస్క్‌టాప్‌లో ఒకటి, యాప్‌లో రెండు 

మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వీటిలో రెండు మొబైల్‌ వెర్షన్‌లో, మరొకటి డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో తీసుకొస్తున్నట్లు ట్విటర్లో పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ ఫీచర్స్ పలువురు యూజర్స్‌కి అందుబాటులోకి రాగా.. తాజా అప్‌డేట్‌లో వాటని పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. మరి ఆ ఫీచర్లేంటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: 252 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు 

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 10,68,514 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మందురోజు కంటే కేసులు 14 శాతం మేర పెరిగాయి. నిన్న 311 మంది మరణించారు. ఒక్క కేరళలో 187 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.43 కోట్లకు చేరగా.. 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Muhurat Trading: మూరత్‌ ట్రేడింగ్‌.. ఏడాదంతా లాభాల పంట!

సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలకు భారత్‌ పెట్టింది పేరు. ఓ మంచి పని చేపట్టే ముందు ముహూర్తం చూసుకొని ప్రారంభించడం ఇక్కడి ఓ ఆచారం. అయితే, పురాణాల్లో పేర్కొన్న ప్రతి విశ్వాసం, సంప్రదాయం వెనుక ఓ శాస్త్రీయ కారణమూ ఉందంటారు పెద్దలు. ఈ క్రమంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనేదే దీపావళి. కానీ, భారత్‌లోని చాలా మంది ఇన్వెస్టర్లు ఈ పండుగను ప్రత్యేకంగా చూస్తారు. ఈరోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం వరిస్తుందని నమ్ముతుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Cinema news: 2021లో అదరగొట్టిన 15 బెస్ట్‌  థ్రిల్లర్స్‌

థ్రిల్లర్‌ సినిమాలను భారతీయ సినీ ప్రేక్షకుల ప్రత్యేక ఆసక్తితో వీక్షిస్తారు. కథతో కట్టిపడేస్తూనే, కథనంతో రక్తికట్టించే సినిమాలొస్తే ఇక పండగే. మంచి థ్రిల్‌తో పాటు, ఊహకందని మలుపులుతో థ్రిల్లర్‌ సినిమాలు ఆకట్టుకుంటాయి. మలయాళంలో ఈ తరహా సినిమాలు వీక్షకుడికి మంచి వినోదాన్ని పంచాయి. తెలుగులో, హిందీ భాషల్లోనూ ఈ ఏడాది మంచి ప్రయోగాలే జరిగాయి. 2021లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న అలాంటి థ్రిల్లర్ సినిమాలేంటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Major: అడివి శేష్‌ ‘మేజర్‌’: 120 రోజులు.. 8 సెట్స్‌.. 75 లొకేషన్స్‌..

9. T20 World Cup: ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలి.. వారిలో అశ్విన్ ఉండాలి: గావస్కర్

టీ20 ప్రపంచకప్‌ 2021లో గెలుపు కోసం ఎదురు చూస్తున్న టీమ్‌ఇండియా ఇవాళ అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. అఫ్గాన్‌తో పోరు అంటే ఆషామాషీ వ్యవహారం కాదనేది ఆ జట్టు ప్రదర్శనను చూస్తే అర్థమైపోతుంది. అఫ్గాన్‌ స్పిన్‌ త్రయంతో జాగ్రత్తగా ఉండాలని మాజీలు కోహ్లీ సేనను హెచ్చరిస్తున్నారు. అలానే ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌, షాహజాద్‌ కూడా ప్రమాదకరమేనని పేర్కొన్నారు. మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో (4 పాయింట్లు) పట్టికలో రెండో స్థానంలో ఉంది ఆ జట్టు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: వాళ్లిద్దరూ ప్లాన్‌ చేసే రవీందర్‌రెడ్డిని చంపేశారా?

నగరంలోని జూబ్లీహిల్స్‌లో జరిగిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ధన్వాడ మండలం సంగినేనిపల్లిలో భూవివాదం ఈ హత్యకు దారి తీసిందని రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నాగిరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మోహన్‌రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించారు. భూవివాదం నేపథ్యంలో రవీందర్‌రెడ్డిపై నాగిరెడ్డి కక్ష పెంచుకున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని