Updated : 07 Nov 2021 13:17 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Siliguri corridor: భారత్‌ బలహీనతపై దెబ్బతీయాలని..!

వాస్తవాధీన రేఖ ఆవల చైనా చర్యలు భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల భారత్‌కు మిత్రదేశమైన భూటాన్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం చైనా ఓ అవగాహనకు వచ్చింది. ఈ క్రమంలో భారత్‌లోని సిలుగురి కారిడార్‌(చికెన్స్‌ నెక్‌)ను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసింది. దీంతో భారత్‌ వర్గాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: వైకాపాకు లేని నిబంధనలు రైతుల పాదయాత్రకు అడ్డొచ్చాయా?: లోకేశ్

రాజధాని మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు చేసిన హెచ్చరికలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు. వైకాపాకు లేని నిబంధనలు అమరావతి రైతుల పాదయాత్రకు అడ్డొచ్చాయా అని నిలదీశారు. అధికార పార్టీ వాళ్లు విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేయట్లేదా అని ప్రశ్నించారు. కొవిడ్‌ నిబంధనలు, స్పీకర్లు పాదయాత్రకే అడ్డొచ్చాయా అని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Amaravati Padayatra: ఏడో రోజుకు ‘మహాపాదయాత్ర’.. భారీగా పోలీసుల మోహరింపు

3. TS News: 3 నెలల చిన్నారి, తండ్రిని కాటేసిన పాము..

మూడు నెలల చిన్నారితో పాటు తండ్రిని పాము కాటేసిన ఘటన మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఏకుల క్రాంతి, మమత దంపతులు.. కుమార్తె(3నెలల చిన్నారి)తో కలిసి శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు. ఆ సమయంలో పసికందును పాము కాటేయడంతో ఏడవటం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఏమైందో అని లేచి చూస్తుండగానే క్రాంతిని సైతం పాము కాటేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Navjot Singh Sidhu: ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తున్న సిద్ధూ

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తప్పుడు సమాచారాన్నీ వ్యాపింపజేస్తున్నారని ఆ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఏపీఎస్‌ దేవోల్‌ ఆరోపించారు. ఏజీ కార్యాలయ విధులకూ అడ్డుపడుతున్నారని, ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని శనివారం ధ్వజమెత్తారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు సిద్ధూ ప్రకటించిన మరుసటి రోజే దేవోల్‌ ఈ విమర్శలను సంధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. BheemlaNayak: మాస్‌ జాతర షురూ.. మూడో సాంగ్‌ అదిరింది

వర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Powerstar Pawankalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak). మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ (Ayyappanum Koshiyum) రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ బయటకు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Pushpa: వామ్మో.. సునీల్‌ మరీ ఇంత క్రూరంగా ఉన్నాడేంటి..!

6. Elon Musk: మస్క్‌కు పెద్ద చిక్కొచ్చి పడింది?మీరూ సలహా ఇవ్వొచ్చు!

ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కు ఓ చిక్కొచ్చి పడింది. స్టాక్స్‌ రూపంలో జీతభత్యాలు తీసుకునే ఆయన.. ఇప్పుడు పన్ను ఎలా కట్టాలన్నది సమస్యగా మారింది. దీనికోసం ఆయన తన వద్ద ఉన్న టెస్లా వాటాల్లో ఓ 10 శాతం అమ్మాలనుకుంటున్నారట. అయితే, ఇది సరైన నిర్ణయమేనా? కాదా? అని ట్విటర్‌లో తన అనుచరులను అడిగారు. అందుకోసం ఏకంగా ఓ పోల్‌నే నిర్వహిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Puneeth Rajkumar: పునీత్‌కు వైద్యమందించిన డాక్టర్‌కు పోలీస్‌ బందోబస్తు

కన్నడ సినీ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బెంగళూరులోని సదాశివనగర పోలీసుస్టేషన్‌కు రెండు ఫిర్యాదులు అందాయి. ఆయన కుటుంబ వైద్యుడు రమణరావును తక్షణం అరెస్టు చేయాలని ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సదాశివనగరలో నివసించే డాక్టర్‌ రమణరావు నివాసం, క్లినిక్‌ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్‌కు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, తమ క్లినిక్‌కు వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్స చేశామని డాక్టర్‌ రమణరావు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Viral Video: కొవిడ్ జాగ్రత్తలపై చిన్నారి ఆదర్శం

యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మనిషికి చాలా పాఠాలనే నేర్పించింది. భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. అయితే కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొందరు మహమ్మారి వ్యాప్తికి కారణమవుతుండగా.. కొవిడ్‌ జాగ్రత్తలపై ఓ చిన్నారి చూపిన చొరవ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బుడిబుడి నడకలతో ఓ పోలీస్‌ వద్దకు వెళ్లిన చిన్నారి తనకు ఉష్టోగ్రత పరీక్షించాలని కోరగా పోలీసులు ఆ పని పూర్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

9. AP News: యుద్ధనౌకకు ‘పరిపాలన రాజధాని విశాఖపట్నం’ పేరు

భారత నౌకాదళంలో త్వరలో ప్రవేశపెట్టనున్న యుద్ధనౌకకు ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో డిఫెన్స్‌ విభాగం జారీ చేసిన ప్రకటనలో ప్రస్తావించడం వివాదాస్పదమైంది. మూడు రాజధానుల అంశం ఇంకా కోర్టు విచారణలో ఉండగానే... విశాఖను పరిపాలనా రాజధానిగా పేర్కొంటూ పీఐబీ డిఫెన్స్‌ విభాగం ప్రకటనం చేయడం, అది కూడా తూర్పు నౌకాదళ ప్రధానాధికారి .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Virat Kohli: టీమ్‌ఇండియాపై పాక్‌ విష ప్రచారం.. అసలు నిజం ఏంటంటే?

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గత రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌లపై విజయం సాధించాక పాకిస్థాన్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత బుధవారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

T20 World Cup: ఇంగ్లాండ్‌పై రబాడ హ్యాట్రిక్‌.. వీడియో చూడండి


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని