Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఎమర్జెన్సీ దిశగా భాజపా వెళ్తోంది: సీఎం కేసీఆర్
ఆర్డినెన్స్ తెచ్చి కేంద్ర ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై జరుపుతున్న పోరాటానికి విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. దిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో గళం విప్పాలని విపక్ష నేతలను కేజ్రీవాల్ కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు 31కి వాయిదా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ నిన్న, ఈరోజు వాదనలు విన్నారు. శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించారు. శనివారం సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది రాష్ట్రం పరిస్థితి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మొత్తం పసుపుమయంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మహానాడుకు భారీగా హాజరయ్యారు. మహానాడులో భాగంగా తొలిరోజైన ఇవాళ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. మరో 35 వేల మంది వరకూ కార్యకర్తలు వస్తారని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. 34 మందితో సిద్ధు కేబినెట్.. డీకేకు 2 శాఖలు..!
కర్ణాటకలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయ్యింది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య కేబినెట్ పూర్తిగా సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అసలు పార్లమెంట్ భవనమే అవసరం లేదు: నీతీశ్
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సంపై (Parliament building) రగడ కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని కొన్ని పార్టీలు బహిష్కరించగా.. మరికొన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పార్లమెంట్ భవనమే అవసరం లేదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. చెన్నై పాంచ్ పటాకానా..? గుజరాత్ డబుల్ ధమాకానా? ఈ ఐపీఎల్ విజేత ఎవరు..?
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్ 16వ (IPL 2023) సీజన్ ముగింపు దశకు చేరుకుంది. విజేతను తేల్చే మహా సమరం ఆదివారం రోజే. ఫైనల్‌లో తలపడేందుకు దిగ్గజ జట్లైన చెన్నై, గుజరాత్‌లు (GT vs CSK) సిద్ధమయ్యాయి. ఐదోసారి కప్ గెలిచి ధోనీ సేన (MS Dhoni) ముంబయి రికార్డును సమం చేస్తుందా..? లేదా వరుసగా రెండోసారి కప్ గెలిచి హార్దిక్ (Hardik Pandya) సేన తన సత్తా చాటుతుందా? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రెండేళ్లలో నాలుగో స్థానానికి భారత్: అశ్వినీ వైష్ణవ్
రాబోయే రెండేళ్లలో భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Economy) అవతరించనుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) అన్నారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల కారణంగా దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో మారిందని చెప్పారు. మోదీ సర్కారు 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఓ సదస్సులో ఆయన శనివారం మాట్లడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. 9 మంది సీఎంలు డుమ్మా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) అధ్యక్షతన నీతి ఆయోగ్ (NITI Aayog) పాలక మండలి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కిమ్ రాజ్యంలో మరో దారుణం.. 2 ఏళ్ల చిన్నారికి జీవితఖైదు
ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రాజ్యంలో దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న నేరాలకే అక్కడ ప్రాణాలు తీసే శిక్షలు విధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కిమ్ పాలనలో అకృత్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. క్రైస్తవులపై ఉత్తరకొరియా ప్రభుత్వ ఆగడాల గురించి తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ‘నేను గుజరాతి బిడ్డను.. అయినా నా మనసు చెన్నై గెలవాలనుకుంటోంది’
ఐపీఎల్-16 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారమే ఫైనల్. ఈ టైటిల్ పోరు (IPL Final 2023)లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. రెండూ బలమైన జట్లే కావడంతో ఫైనల్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నైని ఓడించి గుజరాత్ వరుసగా రెండో ఏడాది టైటిల్ ఎగరేసుకుపోతుందా? లేక ధోనీ (MS Dhoni) తన వ్యూహాలతో సీఎస్కేకు ఐదో కప్‌ను అందిస్తాడా? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ