రెండేళ్లలో నాలుగో స్థానానికి భారత్‌: అశ్వినీ వైష్ణవ్‌

Ashwini Vaishnaw on Economy: రాబోయే రెండేళ్లలో దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఆరేళ్లలో మూడో స్థానానికి భారత్‌ చేరుకుంటుందని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అన్నారు.

Published : 27 May 2023 15:18 IST

దిల్లీ: రాబోయే రెండేళ్లలో భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Economy) అవతరించనుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) అన్నారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల కారణంగా దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో మారిందని చెప్పారు. మోదీ సర్కారు 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఓ సదస్సులో ఆయన శనివారం మాట్లడారు. 

ప్రపంచానికి భారత్‌ ప్రస్తుతం ఒక ఆశాదీపంగా కనిపిస్తోందని, ప్రపంచమంతా భారత్‌ పట్ల విశ్వాసంతో ఉందని వైష్ణవ్‌ పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం ఉంచాలని చెప్పారు. తద్వారా 2047 నాటికి సరికొత్త శిఖరాలను భారత్‌ అధిరోహించబోతోందన్నారు. అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించననుందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ పరంగా పదో స్థానంలో ఉన్న భారత్‌ ప్రస్తుతం ఐదో స్థానానికి చేరిందని వైష్ణవ్‌ గుర్తుచేశారు. రాబోయే రెండేళ్లలో నాలుగో స్థానానికి, ఆరేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు