Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Mar 2024 21:00 IST

1. వాలంటీర్లను దూరంగా ఉంచాల్సిందే.. మరోసారి సీఈసీ స్పష్టత

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు, కాంట్రాక్టు సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మరోమారు స్పష్టం చేశారు. శనివారం దిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈమేరకు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో వైకాపా కౌంట్‌డౌన్‌ ప్రారంభం: చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో వైకాపాకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉందని, మే 13 చారిత్రక రోజని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి.. ఇక ఎవరికీ భయం లేదని, అందరూ బయటకొస్తారని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హక్కుల కోసం తెలుగువారంతా ఏకమవుదాం: సీఎం రేవంత్‌రెడ్డి

దిల్లీ నుంచి సుల్తాన్‌లు వచ్చినా.. ‘విశాఖ ఉక్కు’ను ఒక్క ఇంచ్‌ కూడా కదిలించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విశాఖలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ఏపీ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారు. ప్రశ్నించే నాయకుడు లేకే ప్రధాని మోదీ ఏపీని పట్టించుకోవడం లేదు’’ అని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్‌ ‘సిద్ధం’: షర్మిల

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం సీఎం జగన్‌ ఎందుకు ఉద్యమం చేయలేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. తమ ప్రాణాలు అడ్డువేసి అయినా సరే స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకొంటామని ప్రకటించారు.  విశాఖలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’లో ఆమె మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాంగ్రెస్‌లో చేరిన వరంగల్‌ భారాస ఎంపీ

లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి కొండా సురేఖ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెదేపాలో చేరిన వైకాపా ఎంపీ మాగుంట

ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెదేపాలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు కండువాకప్పి మాగుంటను తెదేపాలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అద్దంకి వైకాపా నేతలు బాచిన కృష్ణచైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశంలో చేరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈనెల 23వరకు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈరోజు ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముఖ్యమైన ఎన్నికల తేదీలు.. పూర్తి వివరాలివే!

కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన కుటుంబం (Indian-Origin Family) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగడంతో వారు చనిపోయారు. గతవారమే (మార్చి 7) ఈ ఘటన జరిగింది. ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను గుర్తించినట్లు నిన్న పోలీసులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. 543 లోక్‌సభ స్థానాలకు గానూ 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు, 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా.. జూన్‌ 1తో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈ నెల 23 వరకు పోలీసుల కస్టడీకి ప్రణీత్‌రావు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. ఈనెల 17 నుంచి 23 వరకు ఏడు రోజుల పాటు  కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసులు ఈ నెల 13న న్యాయస్థానానికి సమర్పించిన రిమాండు నివేదికలో పలు కీలక విషయాలు పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని