Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Mar 2024 21:12 IST

1. ఆప్‌ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన

భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ED) ప్రకటన విడుదల చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం (delhi liquor scam) కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్‌

ప్రజల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. జూన్‌ 7 నుంచి తిరిగి యథాతథంగా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని నోడల్‌ అధికారి తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు

కోడికత్తి డ్రామా నుంచి వివేకా హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్.. ఇప్పుడు కుల, మత రాజకీయాలపై పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానేనని స్పష్టం చేశారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం చంద్రబాబును కలిశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారాసలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భారాసలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్‌తోపాటు పలువురు నేతలు కూడా భారాసలో చేరారు. ఇటీవల భారాస-బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్‌ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే బంగారం ఉన్నట్లు గుర్తించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐపీఎల్‌ 2024 సీజన్‌.. కేఎల్‌ రాహుల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)కు తీపికబురు. కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (KL Rahul) పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించినట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. దీంతో రాహుల్ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు మార్గం సుగుమమైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌కు కొత్త రూల్‌.. జులై 1 నుంచి అమల్లోకి

మొబైల్‌ నంబర్‌ మార్చకుండా వేరే నంబర్‌కు మారేందుకు వెసులుబాటు కల్పిస్తున్న మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) విషయంలో ట్రాయ్‌ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సిమ్‌ కార్డ్‌ స్వాప్‌ లేదా రీప్లేస్‌ చేసిన ఏడు రోజుల వరకు వేరే నెట్‌వర్క్‌కు మారడాన్ని నిలిపివేసింది. సిమ్‌ స్వాప్‌ మోసాలను అరికట్టేందుకు గానూ ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాజకీయాల్లోకి లాలూ మరో కుమార్తె..?

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌(Lalu Prasad Yadav) తన కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya)ను ఆర్జీడీ కంచుకోట అయిన సరన్‌(Saran) నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు పార్టీ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె

విధి.. ఆ అమ్మాయికి ఒకేసారి రెండు పరీక్షలు పెట్టింది. ఏడాదంతా ఎదురుచూసింది ఒకటైతే.. కలలోనైనా ఊహించనిది మరొకటి! తల్లిదండ్రుల కలల సాకారానికి తొలిమెట్టు వేస్తుండగానే.. కాయకష్టం చేసి చదివించిన తండ్రి కన్నుమూశాడు. పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న ఓ విద్యార్థిని ఎదుర్కొన్న ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్‌

‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. అవి ఏ మతపరమైనవి కావని.. కేవలం అధర్మం, అవినీతి, అసత్యాల గురించేనని క్లారిటీ ఇచ్చారు. ఈసందర్భంగా ప్రధానిపై విరుచుకుపడిన ఆయన మోదీ వేసుకున్న ‘ముసుగు పవర్‌’ను ఉద్దేశిస్తూ తాను అలా మాట్లాడానన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని