KL Rahul: ఐపీఎల్‌ 2024 సీజన్‌.. కేఎల్‌ రాహుల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ ముంగిట లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)కు గుడ్‌న్యూస్‌. ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (KL Rahul) పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు. 

Updated : 18 Mar 2024 20:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ (IPL) 2024 సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)కు తీపికబురు. కెప్టెన్‌ కేఎల్ రాహుల్ (KL Rahul) పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించినట్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. దీంతో రాహుల్ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు మార్గం సుగుమమైంది.  కానీ, టోర్నీ ప్రారంభదశలో వికెట్‌కీపింగ్‌కు దూరంగా ఉండి స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగాలని బీసీసీఐ వైద్యబృందం సూచించింది. రాహుల్ రెండ్రోజుల్లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో కలవనున్నాడు. మార్చి 24న రాజస్థాన్‌ రాయల్స్‌తో లఖ్‌నవూ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మధ్యలో రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. లండన్‌ వెళ్లి ప్రత్యేక వైద్యబృందంతో చికిత్స చేయించుకుని భారత్‌కు తిరిగొచ్చాడు. ఫిట్‌నెస్‌ సాధించేందుకు నేరుగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని