Vizianagaram: యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు

రైలు ప్రమాదం జరిగిన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం భీమాలి వద్ద ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

Updated : 30 Oct 2023 11:23 IST

విజయనగరం: రైలు ప్రమాదం జరిగిన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం భీమాలి వద్ద ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదంలో బోగీలు నుజ్జునుజ్జు కావడంతో వాటిని పెద్ద యంత్రాల సాయంతో తొలగించారు. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్‌ను తీసుకొచ్చి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 7 సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. బోగీల తరలింపు, ట్రాక్‌ పునరుద్ధరణను వేగవంతం చేశారు.

రద్దయిన రైళ్ల వివరాలివీ..

పలాస ప్యాసింజర్‌లోని 11 బోగీలను అలమండ స్టేషన్‌కు, రాయగడ ప్యాసింజర్‌ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్‌కు తరలించారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఘటనాస్థలి వద్ద రెండు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. స్థానికులను అక్కడికి రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని