ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై వినూత్న నిరసన

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

Updated : 10 May 2024 09:49 IST

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేస్తే ప్రజలు తమ ఆస్తులు, సర్వస్వం జగన్‌కు ధారాదత్తం చేసినట్లేనని ఇందులో పేర్కొన్నారు. రూ.వంద దస్తావేజును పోలిన నమూనా పత్రంపై వ్యంగ్యంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘నా భూమి- మీ హక్కు’.. ఫ్యాన్‌కు ఓటు వేసినందుకు ఇది నా ఖర్మ అని ముగించారు.

న్యూస్‌టుడే, కడియం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని