TS News: కొత్త జిల్లాలకు టీచర్ల కేటాయింపుల వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు

ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి వరకు తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త జిల్లాలకు టీచర్ల కేటాయింపుల వివాదాలపై ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల

Updated : 29 Dec 2021 16:31 IST

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి వరకు తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పనిచేస్తున్న  జిల్లా నుంచి మరో ప్రాంతానికి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ టీచర్లు దాఖలు చేసిన పలు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ, భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేయడం వంటి  పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని కేటాయింపులను పునఃపరిశీలించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ఉపాధ్యాయుల అప్పీళ్లను జీవోకు అనుగుణంగా పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విద్యాశాఖ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. రేపటి వరకు అప్పీళ్లను పరిష్కరించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. మరి కొన్ని పిటిషన్లలో అప్పీళ్లను పరిష్కరించేందుకు జనవరి 10 వరకు హైకోర్టు విద్యాశాఖకు గడువు ఇచ్చింది. టీచర్ల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపాలని డీఈవోలను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని