TS News: మా బొగ్గు మాకే కావాలి: ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌

దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో విద్యుత్‌ సంక్షోభం నెలకొనే ప్రమాద ముందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం

Published : 17 Oct 2021 01:53 IST

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో విద్యుత్‌ సంక్షోభం నెలకొనే ప్రమాద ముందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మా బొగ్గు మాకే కావాలంటున్నాయి. భూపాలపల్లి నుంచి బొగ్గును తరలించొద్దని తెలంగాణ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అధికారులను కోరారు. భూపాలపల్లిలో విద్యుత్‌ ఉత్పత్తి  కోసమే తాడిచర్ల బొగ్గును వాడాలని సూచించారు. తాడిచర్ల నుంచి ఇతర రాష్ట్రాలకు బొగ్గు తరలింపుపై కేంద్రంలోని కొద్దరు పెద్దలు సింగరేణి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కొరత ఉందని తాడిచర్ల నుంచి సింగరేణి బొగ్గును తరలించి భూపాలపల్లిలో విద్యుత్‌ ఉత్పత్తికి విఘాతం కలిగిస్తే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు.  తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న ఆలోచనను మానుకోవాలని కేంద్రాన్ని వినోద్‌ డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని