Health: పులిరాజా వెళ్లిపోలేదు.. జాగ్రత్త!

అవగాహన కల్పించడంతో పాటు మందులు, ఇతరత్రా జాగ్రత్తలతో చాలా వరకు హెచ్‌ఐవీని నియంత్రించడానికి వీలయ్యింది. 

Updated : 22 Aug 2022 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవగాహన కల్పించడంతో పాటు మందులు, ఇతరత్రా జాగ్రత్తలతో చాలా వరకు హెచ్‌ఐవీని నియంత్రించడానికి వీలయ్యింది. చాలా వరకు మరణాలు తగ్గుముఖం పట్టాయి. అయినా హెచ్‌ఐవీ విషయంలో చాలా మందికి ఎక్కువ అనుమానాలే ఉన్నాయి. మగవారిలో కనిపించే తెల్లబట్ట హెచ్‌ఐవీతోనే వస్తుందా..? దంపతులిద్దరికీ హెచ్‌ఐవీ ఉంటే పిల్లలకు వస్తుందా..? అనే భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ అనుమానాల నివృత్తికి చీఫ్‌ ఫిజిషియన్‌ కూటికుప్పల సూర్యారావు పలు సూచనలు చేశారు. 

పులిరాజా వెళ్లిపోయాడా..: అంతర్జాతీయంగా స్థాయిలో నిధులు రాకపోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారానికి, కండోమ్‌లకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రకటనలు కనిపించడం లేదు. దీంతో చాలా మంది యువత ఎయిడ్స్‌ కేసులు తగ్గిపోయాయనుకుంటున్నారు. మళ్లీ విచ్చలవిడిగా ఇతరులతో సెక్స్‌ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అందుకే కొంతకాలంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ కేసులు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. 

తెల్లబట్ట ఎందుకు అవుతుంది: కొంతమంది మహిళల్లో ఎక్కువగా తెల్లబట్ట అవుతుండడాన్ని హెచ్‌ఐవీ కేసుల్లో చూశాం. తెల్లబట్ట అయినంత మాత్రాన హెచ్‌ఐవీ కాదు..బ్యాక్టీరియా, వైరస్‌ ఉందో పరీక్షించిన తర్వాతే నిర్థారణకు రాగలం. అయితే ఇపుడు వాళ్లకు చాలా మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. మందులు వాడిన తర్వాత ఎలాంటి ఇబ్బందులుండవు. 

మగవారిలో ఎందుకిలా: మగవారిలో తెల్లబట్ట రాదు కానీ..వయసు మళ్లిన తర్వాత ఇంద్రియం తయారయ్యే సంచుల నుంచి బయటకు రావడంతోనే తెల్లబట్ట అనుకుంటారు. ఇది చాలా సర్వసాధారణం. దీనికి మందులు వాడాల్సిన అవసరం లేదు. గనేరియా వచ్చినపుడు తెల్లని చీము పురుషాంగం నుంచి బయటకు వస్తుంది. దాన్ని కూడా కొంతమంది తెల్లబట్ట అనుకుంటారు. గనేరియా ఉన్న స్త్రీతో సంబంధం ఉన్నపుడే ఇలాంటి సమస్య వస్తుంది. ఏఆర్టీ మందులను ప్రతి ఆరు నెలలకోసారి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకొని మార్చుకోవాలి. ఏళ్ల తరబడి అవే వాడితే డ్రగ్‌ రెసిస్టెంట్‌గా మారే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని