హారిస్ ప్రసంగంలో భారతీయ పదం
నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీపడుతున్నారు. బుధవారం ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ కీలక ప్రసంగం చేశారు....
వాషింగ్టన్: నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్.. బుధవారం ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ కీలక ప్రసంగం చేశారు. ఉపాధ్యక్ష పదవికి పోటీచేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. అలానే తన తల్లి నేర్పిన విలువలకు, జో బైడెన్ ఆలోచనలకు కట్టుబడి పనిచేస్తాని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో ‘చిత్తి’ అనే తమిళ పదం ఉపయోగించారు. దాంతో దాని అర్థం ఏమై ఉంటుందా అని తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో విపరీతంగా వెతికారట. చాలాసేపు ఆ పదం గూగుల్ ట్రెండ్స్‌లోకి రావడంతో నెట్టింట్లో దాని గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ తమిళంలో ‘చిత్తి’ అంటే పిన్ని అని అర్థం.
భారతీయ మూలాలున్న కమలా హారిస్ తన ప్రసంగంలో కుటుంబ ప్రాధాన్యం గురించి చెప్పుకొస్తూ ఈ పదం ఉపయోగించారు. చిన్నతనంలో తన తల్లితో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ ‘‘నాకు, నా సోదరికి నా తల్లి ఎన్నో విలువలు నేర్పింది. కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నేర్పింది’’ అని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కుటుంబం, భారతీయ సంప్రదాయం, భాష గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి అని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మన విషాదాలను అస్త్రాలుగా మార్చుకుంటున్నారని, ఆయన నాయకత్వ వైఫల్యం మన జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేసిందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ముందుగా అనుకున్న సమయానికంటే 4 సెకన్లు ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. -
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
పెళ్లి పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!