మధ్యప్రదేశ్‌లోకి చొరబడిన 100 మంది నక్సలైట్లు!

మధ్యప్రదేశ్‌లో తమ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు మావోయిస్టులు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి...

Published : 03 Jan 2021 23:51 IST

బాలాఘాట్‌: మధ్యప్రదేశ్‌లో తమ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు మావోయిస్టులు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి దాదాపు 100 మంది మావోయిస్టులు మధ్యప్రదేశ్‌లోకి చొరబడినట్లు పోలీసులు తెలిపారు. వారి ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికే తరలివచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, మండ్లాకు 6 పారామిలిటరీ దళాలను పంపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ‘‘మాకు అందిన సమాచారం ప్రకారం తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి  కొన్ని నెలలుగా దాదాపు 100 మంది నక్సలైట్లు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చారు. బాలాఘాట్, మండ్లా జిల్లాల్లో 6 నక్సలైట్‌ దళాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అందులో కతియా మోచా దళం మండ్లాకు గతేడాదే వచ్చింది’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఇదీ చదవండి.. 

 డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ నటి అరెస్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని