Lockdown: లాక్‌డౌన్‌ ఎత్తేయాలంటూ వీధుల్లోకి.. 250మంది అరెస్టు

కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని పలు నగరాల్లో శనివారం .....

Updated : 21 Aug 2021 19:20 IST

మెల్‌బోర్న్‌: కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని పలు నగరాల్లో శనివారం నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.  మెల్‌బోర్న్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులను అడ్డుకొనేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని దాటుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులపై పెప్పర్‌ స్ప్రే చల్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు సైతం గాయపడ్డారు. 

మరోవైపు, ఈ ఘటనల్లో ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో దాదాపు 250 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెండు మాసాలుగా సిడ్నీలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా నగరాల్లో ఈ నెల ప్రారంభంలోనే ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ నిబంధనలు విధించారు. దీంతో లాక్‌డౌన్‌ను విరమించాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తుండగా..   కరోనా వైరస్‌ వ్యాప్తిని అదుపుచేసి ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని