రవి కిషన్‌కు ఊరట.. డీఎన్‌ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ

ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్‌ తన తండ్రి అంటూ జూనియర్‌ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే.

Updated : 27 Apr 2024 05:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్‌ తన తండ్రి అంటూ జూనియర్‌ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. ఈ విషయాన్ని తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలంటూ ఇటీవల ఆమె ముంబయి కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. రవి కిషన్‌ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా తల్లి అపర్ణా సోని లఖ్‌నవూలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అనంతరం షినోవా సోనీ డీఎన్‌ఏ పరీక్ష కోసం హైకోర్టును ఆశ్రయించారు. రవికిషన్‌, అపర్ణల మధ్య రిలేషన్‌ ఉన్నట్టు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్న కోర్టు.. డీఎన్‌ఏ పరీక్ష అభ్యర్థనను తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని