రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు

దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది.

Published : 27 Apr 2024 05:34 IST

కేజ్రీవాల్‌ సర్కారుపై దిల్లీ హైకోర్టు మండిపాటు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. అరెస్టైన తర్వాత కూడా కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం ద్వారా జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోందని పేర్కొంది. అధికారాన్ని అంటిపెట్టుకోవడంపైనే దిల్లీ సర్కారుకు మక్కువ ఉన్నట్లు కనిపిస్తోందంది. మరోవైపు, ఈ కేసులో దిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది.. పుస్తకాల సరఫరాకు సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అనుమతులు కావాల్సి ఉందని, ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తాము ఇప్పటివరకు జాతి ప్రయోజనాలే ముఖ్యమని హుందాగా చెప్పామని, అయితే ఎక్కడ తప్పు జరిగిందో ఈ కేసు నొక్కిచెబుతోందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో సోమవారం ఆర్డర్‌ జారీ చేస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని