సిసోదియా జ్యుడిషియల్‌ కస్టడీ 8 వరకు పొడిగింపు

దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులో అరెస్టైన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్‌ సిసోదియా, సహ నిందితుడు విజయ్‌ నాయర్‌, ఇతరుల జ్యుడిషియల్‌ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది.

Published : 27 Apr 2024 05:32 IST

దిల్లీ: దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులో అరెస్టైన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్‌ సిసోదియా, సహ నిందితుడు విజయ్‌ నాయర్‌, ఇతరుల జ్యుడిషియల్‌ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. గతంలో విధించిన జ్యుడిషయల్‌ కస్టడీ ముగియడంతో పోలీసులు నిందితులను వీడియో సమావేశం విధానంలో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరీ బవేజ ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించారు. మరోవైపు, అభియోగపత్రానికి సంబంధించిన పత్రాల డిజిటైజేషన్‌కు ఎంత సమయం పడుతోందో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని