India Corona: కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. తాజాగా ఎన్నంటే..?

దేశంలో మరోసారి కరోనా(Coronavirus) కలవరపెడుతోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Published : 07 Apr 2023 11:52 IST

దిల్లీ: గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా వైరస్(Coronavirus) ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆరువేల మంది వైరస్ బారినపడ్డారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

కొత్తగా ౧,౭౮,౫౩౩ మందికి కొవిడ్ (చొవిద్ ౧౯) నిర్ధారణ పరీక్షలు చేయగా.. ౬,౦౫౦ మందికి వైరస్ సోకిందని కేంద్రం వెల్లడించింది. ముందురోజు కంటే ౧౩ శాతం మేర పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్ ౧౬ తర్వాత మొదటిసారి కేసులు ఐదు వేల మార్కు దాటాయి. దాంతో రోజువారీ పాజిటివిటీ రేటు ౩.౩౯ శాతానికి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అవి ౨౮,౩౦౩ (౦.౦౬శాతం)కి చేరాయి. రికవరీ రేటు ౯౮.౭౫ శాతంగా నమోదైంది. ౨౪ గంటల వ్యవధిలో ౧౪ మరణాలు రికార్డయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య ౫,౩౦,౯౪౩కు చేరింది. ఇప్పటివరకూ ౨౨౦.౬౬ కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.జా వ్యాప్తి కేరళ, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya)రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, వైద్య నిపుణులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని