జైళ్లలో అల్లర్లు.. 62 మంది ఖైదీల మృతి

ఈక్వెడార్‌లోని జైళ్లలోని ఖైదీల మధ్య చెలరేగిన అల్లర్లలో 62 మంది మృతిచెందారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు....

Published : 24 Feb 2021 15:12 IST

క్విటో: ఈక్వెడార్‌లోని జైళ్లలోని ఖైదీల మధ్య చెలరేగిన అల్లర్లలో 62 మంది మృతిచెందారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు జైళ్లలో హింసాకాండ చెలరేగగా దక్షిణ క్యూకాలోని జైలులో 33 మంది, గుయాక్విల్‌ జైలులో 21 మంది, లాటాకుంగాలోని మరో జైలులో 8 మంది మరణించినట్లు జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ స్పష్టం చేశారు. సోమవారం ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తగా వారిని అదుపుచేసే క్రమంలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘర్షణలను అదుపుచేసేందుకు జైళ్లలో భారీగా బలగాలను మోహరించినట్లు తెలిపారు. కారాగారాల్లో ఆధిపత్యం కోసం రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగి, అదికాస్తా పరస్పర దాడులకు దారి తీసినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని