అమెరికాలో ఆరు బయటే క్షౌరం!

వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాలిఫోర్నియాలో ఆంక్షలు అమలుచేస్తున్నారు. హెయిర్‌ సెలూన్‌ కేంద్రాలు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

Published : 23 Jul 2020 12:05 IST

కాలిఫోర్నియాలో ఔట్‌ డోర్‌ సెలూన్లకే అనుమతి
వైరస్‌ తీవత్రతో అమెరికా రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆంక్షలు!

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. నిత్యం దాదాపు 60వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాలు అమలుచేస్తోన్న ఆంక్షలు అక్కడి వ్యాపార, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాలిఫోర్నియాలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హెయిర్‌ సెలూన్‌ కేంద్రాలు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఆంక్షలను సడలించిన ప్రభుత్వం, కేవలం క్షౌరశాలలను బహిరంగ ప్రదేశాల్లోనే నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆరుబయట కూడా భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజ్‌ చేయడం తదితర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం దుకాణదారులను ఆదేశించింది. దీంతో దుకాణాల ముందే టెంట్లు వేసి హెయిర్‌ కటింగ్‌ పనులు చేస్తున్నారు. అయితే కనీసం ఆరుబయటనైనా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినందుకు ఊరట లభించిందని హెయిర్‌ సెలూన్‌ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 39లక్షల కరోనా కేసులు నమోదుకాగా వీరిలో లక్షా 47వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..
అమెరికాలో పరిస్థితులు మరింత క్షీణిస్తాయ్‌..ట్రంప్‌
ఆ చైనా కాన్సులేట్‌ మూసేయండి..అమెరికా ఆదేశం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని