2021 నాటికి ఉన్నత విద్యా కమిషన్‌!

స్వయం ప్రతిపత్తి సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ యూజీసీ, ఏఐసీటీఈల స్థానంలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి....

Published : 12 Dec 2020 23:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వయం ప్రతిపత్తి సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ యూజీసీ, ఏఐసీటీఈల స్థానంలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈమేరకు 2021లో ప్రధాన మార్పులు కనిపించే అవకాశం ఉందని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ కరే ఓ సమావేశంలో వెల్లడించారు. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన అన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలను విలీనం చేస్తామన్నారు. 

ఉన్నత విద్యకోసం అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఓ విద్యా మండలిని ఏర్పాటు చేయాలని జాతీయ విద్యా విధానం ఎన్‌ఈపీ ఇప్పటికే సిఫారసు చేసింది. అయితే వైద్య, న్యాయ విద్యకు మినహాయింపు ఇవ్వాలని సూచించింది. దేశంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు జాతీయ పరిశోధనా నిధిని ఏర్పాటు చేయాలన్న ఎన్‌ఈపీ సిఫారసును అమిత్‌ కరే గుర్తుచేశారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కాంపిటీటివ్‌ ఫండ్‌ని కలిగి ఉండవచ్చన్నారు. జాతీయ పరిశోధనా నిధిలో సామాజిక శాస్త్రం కూడా భాగం కానుందని కరే పేర్కొన్నారు. 

ఇవీ చదవండి..

ఉన్నత విద్యలో భారత్‌ ఓ హబ్: వెంకయ్య

ఏపీలో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని