పార్లమెంట్ సమావేశాలు కుదించే యోచనలో కేంద్రం!

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ప్రత్యేకంగా జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు కంటే వారం ముందే ముగిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కొవిడ్ బారిన పడినందున కేంద్రం ....

Published : 19 Sep 2020 15:50 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ప్రత్యేకంగా జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు కంటే వారం ముందే ముగిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కొవిడ్ బారిన పడినందున కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు పార్లమెంట్‌ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్నెళ్ల వ్యవధిలో తొలిసారిగా ఈ నెల 14న సమావేశమైన పార్లమెంట్‌ ఉభయసభలు అక్టోబర్‌ 1వరకు కొనసాగుతాయని తొలుత కేంద్రం ప్రకటించింది.అయితే, నితిన్‌ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, 30 మంది ఎంపీలు ఈ మహమ్మారి బారినపడటంతో వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే బిల్లులను త్వరితగతిన ఆమోదింపజేసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ సంబంధ బిల్లులను ఆమోదించిన కేంద్రం.. వచ్చే బుధవారం వరకే సమావేశాలు కొనసాగుతాయన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ లోపు మిగతా అన్ని బిల్లులను ఆమోదింపజేసుకొనేలా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా సాయంత్రం 5గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల కుదింపు అంశంపై చర్చించే అవకాశం ఉంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని