నా హెయిర్‌ స్టైల్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండాలంతే... ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడి చిన్న ఇబ్బంది, ఆ దేశంలో నియమాలను మార్చేందుకు దారితీయనుంది.

Published : 13 Aug 2020 23:52 IST

వాషింగ్టన్‌: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. అమెరికా అధ్యక్షుడి చిన్న ఇబ్బంది, ఆ దేశంలో నియమాలను మార్చేందుకు దారితీయనుంది. హాయిగా తలస్నానం చేసేందుకు సరిపడే వేగంతో తన షవర్‌లో నీరు రావట్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఓ సమావేశంలో అన్నారు. నీటి ఒత్తిడి తగ్గటంతో తనకు ఇబ్బందిగా ఉందంటూ ‘‘ఇంకేం చేస్తాం? ఇంకాస్త ఎక్కువ సేపు స్నానం చేస్తాం... షవర్‌ క్రింద ఎక్కువసేపు నిలబడతాం. మీ సంగతేమో కానీ, నా హెయిర్‌ స్టైల్‌ మాత్రం పెర్‌ఫెక్ట్‌గా ఉండే తీరాలి!’’ అన్నారు. ఈ విధంగా అధ్యక్షుడు గతంలో కూడా పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేయటంతో.. అక్కడి ప్రభుత్వ యంత్రాంగం నీటి ఒత్తిడిని నిబంధనలను మార్చే ప్రయత్నాల్లో పడింది.

అయితే అమెరికా ప్రజలు విద్యుత్తు, జలవనరులను ఆదా చేయాలని ట్రంప్‌ గత డిసెంబర్‌లో పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే అక్కడి అధికారులు ఇళ్లలోని వాష్‌బేసిన్లు, షవర్లు, టాయిలెట్ల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. కాగా, తన తాజా వ్యాఖ్యలను ట్రంప్‌ సమర్థించుకున్నారు. నీటి వేగం తగ్గడంతో ప్రజలు టాయిలెట్లను ఒకటికి పదిసార్లు ఫ్లష్‌ చేస్తున్నారని, స్నానం ఎక్కువ సేపు చేస్తున్నారంటూ.. దీని వల్ల వ్యతిరేక ఫలితం వస్తోందని ఆయన తేల్చారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహా అమలులోకి వచ్చేదీ లేనిదీ ఇంకా నిర్ధారణ కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని