మోదీ, రాహుల్‌కు బార్బీ మేకోవర్‌.. అంతా AI మాయ!

AI Barbie Makeover To Politicians: ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టిస్తున్న చిత్రాలు, వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా మన పొలిటీషిన్లూ అందులో భాగమయ్యారు.

Published : 29 Jul 2023 01:37 IST

Courtesy: whoworewhat.club Insta

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్‌ చిత్రం బార్బీ ఫీవర్‌ నడుస్తోంది. వార్నర్‌ బ్రదర్స్‌ సమర్పణలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం పుణ్యమాని అంతటా గులాబీ రంగు పులుముకొంది. ఆఖరికి గూగుల్‌లో బార్బీ చిత్రం గురించి సెర్చ్‌ చేసినా బ్రౌజర్‌ సైతం అదే రంగు కనిపిస్తోంది. దీనికి ఏఐని, పొలిటికల్‌ యాంగిల్‌ని మిక్స్‌ చేస్తే ఎలా ఉంటుంది? అదే ఆలోచన వచ్చింది ఓ ఔత్సాహికుడికి.

బస్సులో మొదటి ప్యాసింజర్‌ ‘మహిళ’.. అపశకునమట!

మన దేశ రాజకీయ నాయకులకు అలా ఏఐ సాయంతో బార్బీ మేకోవర్‌ ఇచ్చాడు ఓ వ్యక్తి. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, నితిన్‌ గడ్కరీ, మమతా బెనర్జీ, అమిత్‌ షా, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌కు సినిమాటిక్‌ లుక్‌ ఇచ్చారు. మంచి మేకప్, కొత్త హెయిర్‌ స్టైల్స్, గులాబీ రంగుల దుస్తులతో మెరుస్తున్న ఆ ఫొటోలను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు. ‘ఇందులో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు?’ అంటూ కామెంట్‌ను జోడించాడు. అంతే ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నిత్యం ఒకే తరహా దుస్తుల్లో కనిపించే నాయకులు.. ఇలా ట్రెండీ లుక్కులో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని