Amarnath Yatra: యాత్ర ప్రారంభానికి గుర్తుగా.. అమర్‌నాథ్‌ గుహలో ప్రత్యేక పూజలు

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభానికి గుర్తుగా ఆ శివ లింగం కొలువుదీరే అమర్‌నాథ్‌ గుహలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి.

Published : 03 Jun 2023 23:58 IST

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభానికి గుర్తుగా ఆ శివ లింగం కొలువుదీరే అమర్‌నాథ్‌ గుహలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రథమ పూజగా పిలిచే ఈ క్రతువులో జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) మనోజ్‌ సిన్హా దృశ్యమాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరమశివుని భక్తులకు అమర్‌నాథ్‌ రావడం ఓ జీవిత కాలపు కల అని ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. ఈ యాత్ర వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుందని, యాత్ర విజయవంతం కావడానికి వారు ఇతోధికంగా సాయపడుతున్నారన్నారు. యాత్రికుల రక్షణకు, కనీస అవసరాలు తీర్చడానికి శ్రీ అమర్‌నాథ్‌ జీ దేవస్థానం బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) కృషి చేస్తోందని ఎల్జీ వెల్లడించారు. జులై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని