Desmond Tutu:నోబెల్‌ శాంతి బహుమతిగ్రహీత డెస్మండ్‌ టుటు కన్నుమూత

దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్‌ బిషప్‌ డెస్మండ్ టుటు(90) ఆదివారం కన్నుమూశారు. టుటు కుటుంబ సభ్యులతోపాటు దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ విషయాన్ని వెల్లడించారు...

Published : 26 Dec 2021 15:40 IST

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన హక్కుల కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్‌ బిషప్‌ డెస్మండ్ టుటు(90) ఆదివారం కన్నుమూశారు. టుటు కుటుంబ సభ్యులతోపాటు దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఈ ఉదయం కేప్ టౌన్‌లోని ఒయాసిస్ ఫ్రైల్ కేర్ సెంటర్‌లో టుటు తుదిశ్వాస విడిచారు’ అని ఆయన కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, మృతికి గల కారణాలను అందులో వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో మరొకరిని కోల్పోయామని అధ్యక్షుడు రామఫోసా సంతాపం వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికా నైతిక దిక్సూచిగా పేరుపొందిన టుటు.. 1980ల్లో స్థానికంగా నల్ల జాతీయులపై క్రూరమైన అణచివేత పాలనకు, జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖుల్లో ఒకరు. ఎల్‌జీబీటీల హక్కుల కోసం గళమెత్తారు. ఆయన అహింసాయుత పోరాటానికి గుర్తింపుగా 1984లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జొహన్నెస్‌బర్గ్‌కు మొదటి నల్లజాతి బిషప్‌గా, తరువాత కేప్ టౌన్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు. 1997లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్‌ నిర్ధారణ కాగా.. కొన్నేళ్లుగా దాని చికిత్సకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌లతో చాలాసార్లు ఆయన ఆసుపత్రిలో చేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని