Agniveer Recruitment: ఆర్మీ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆర్మీలో అగ్నివీరుల  (Agniveer) నియామకాల కోసం భారత సైన్యం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Updated : 20 Jun 2022 16:19 IST

జులై నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

దిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్‌ (Agnipath) పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివిధ దళాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మీలో అగ్నివీరుల  (Agniveer) నియామకాల కోసం భారత సైన్యం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకోసం జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్‌లో వివరంగా పేర్కొంది. అంతేకాకుండా అగ్నివీరులకు ఇచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, సర్వీసు నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను నోటిషికేషన్‌లో పొందుపరిచింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అగ్నిపథ్‌ (Agnipath)పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన త్రివిధ దళాల ఉన్నతాధికారులు.. సైన్యంలో సరాసరి వయసును తగ్గించే లక్ష్యంతోనే ఈ సంస్కరణలను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆర్మీ నేడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరోవైపు వాయుసేన, ఇండియన్‌ నేవీలకు సంబంధించిన అగ్నివీరుల నియామాక నోటిఫికేషన్‌లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే, నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు (Agniveers) రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పిస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని