నీటిలో తేలియాడుతున్న శరీర భాగాలు.. శకలాలు!

ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విమాన ఘటన దాదాపు విషాదాంతమైనట్లే తెలుస్తోంది. విమాన ఆచూకీ కోసం శనివారం ముమ్మరంగా గాలిస్తున్న సిబ్బంది...............

Updated : 10 Jan 2021 13:47 IST

దాదాపు విషాదాంతమైన ఇండోనేసియా విమాన అదృశ్య ఘటన!

జకార్తా : ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైన విమాన ఘటన దాదాపు విషాదాంతమైనట్లే తెలుస్తోంది. విమాన ఆచూకీ కోసం శనివారం మొదలుపెట్టిన గాలింపులో ఆదివారం ఉదయం నాటికి కొంత పురోగతి కనిపించింది. ఈ రోజు ఉదయం జావా సముద్రంలో కొంతమంది శరీర భాగాలు, దుస్తులు సహా కొన్ని విమాన శకలాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆ దేశ రావాణాశాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. ఇప్పటి వరకు లభించిన శకలాలు లాంకాంగ్‌, లకీ ద్వీపాల మధ్య కనుగొన్నట్లు వెల్లడించారు. చివరిసారి అందిన సంకేతాల ఆధారంగా విమానం అదశ్యమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు అటు నావికాదళం సైతం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విమానం అదశ్యమై దాదాపు 16 గంటలు గడుస్తున్నా.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జకార్తా నుంచి పోంటియానక్‌కు బయల్దేరిన బోయింగ్‌ 737-500 విమానం శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనిలో 12 మంది సిబ్బంది, 50 మంది ప్రయాణికులు కలిపి 62 మంది ఉన్నారు. టేకాఫ్‌ అయిన నాలుగు నిమిషాల్లోనే రాడార్‌పై నుంచి అదృశ్యమయింది. శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. విమాన శకలాలుగా అనుమానిస్తున్న లోహపు భాగాలను, కొన్ని తీగలను ఉత్తర జకార్తాలోని థౌజండ్‌ ఐలాండ్స్‌ (ద్వీపాల సముదాయం)లో గుర్తించినట్లు మత్స్యకారులు తెలిపారు. తమకు 30 మీటర్ల దూరంలో పిడుగుపాటు, బాంబుపేలుడు వంటిదేదో సంభవించినట్లు అనిపించిందని చెప్పారు.

ఇవీ చదవండి..

ఇండోనేసియాలో విమానం అదృశ్యం

డొనాల్డ్‌ ట్రంప్‌ నెత్తిన కత్తి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని