Drone: బార్డర్‌లో డ్రోన్‌ సంచారం.. కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌

దేశ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా డ్రోన్లు సంచరిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్‌- పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్‌ సంచారం కలకలం సృష్టించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో వాన్‌ బార్డర్‌ పోస్టుకు సమీపంలో...

Updated : 18 Dec 2021 15:48 IST

చండీగఢ్‌: దేశ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా డ్రోన్లు సంచరిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్‌- పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్‌ సంచారం కలకలం సృష్టించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో వాన్‌ బార్డర్‌ పోస్టుకు సమీపంలో సరిహద్దు భద్రతా బలగాలు(బీఎస్‌ఎఫ్) శుక్రవారం రాత్రి ఓ డ్రోన్‌ను గుర్తించాయి. వెంటనే అప్రమత్తమై.. దాన్ని కూల్చివేశాయి. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘చైనాలో తయారైన ఓ డ్రోన్‌ను శుక్రవారం రాత్రి 11:10 గంటల ప్రాంతంలో వాన్ పోస్ట్ సమీపంలో కూల్చివేశాం. అంతర్జాతీయ సరిహద్దుకు 300 మీటర్ల దూరంలో, సరిహద్దు కంచెకు 150 మీటర్ల దూరంలో ఇది చోటుచేసుకుంది’ అని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. కొన్నాళ్ల క్రితం జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సైన్యం వీటి కార్యకలాపాలపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఆయుధాలు, మాదకద్రవ్యాలతో ఇవి భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయని ఇటీవల బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ పంకజ్ సింగ్ తెలిపారు. వాటిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నట్లు చెప్పారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని