భివాండీ ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం తెల్లవారుజూమున మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా(ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు వెల్లడించాయి.........

Updated : 22 Sep 2020 10:41 IST

భివాండీ: మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం తెల్లవారుజూమున మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుపోయిన 20 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందనా(ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు వెల్లడించాయి. భవనం శిథిలావస్థకు చేరడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘భివాండీ ఘటన ఎంతగానో కలచివేసింది. బాధితుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ‘భవనం కూలిపోవటం విచారకరం. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలకు నా సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తాం’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని