Corona: మెదడుపైనా కొవిడ్‌ ప్రభావం

కొవిడ్‌-19 మెదడుపై కూడా ప్రభావం చూపుతుందా... అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. తీవ్ర కరోనాతో చనిపోయిన వారిలో పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ మృతుల్లో కనిపించే రీతిలో మెదడులో

Updated : 24 Jun 2021 07:30 IST

మతిమరుపు, కుంగుబాటు తదితర సంకేతాలు

బోస్టన్‌: కొవిడ్‌-19 మెదడుపై కూడా ప్రభావం చూపుతుందా... అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. తీవ్ర కరోనాతో చనిపోయిన వారిలో పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ మృతుల్లో కనిపించే రీతిలో మెదడులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌), నాడీ క్షీణత కనిపించిందని అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌, జర్మనీకి చెందిన సార్లాండ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘ కొవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నవారిలో ఈ వాపు ప్రక్రియ ప్రభావం తీవ్రంగా ఉందని వీరి పరిశోధనలో తేలింది. కొవిడ్‌-19తో ఆసుపత్రి పాలైన వారిలో మూడింట ఒక వంతు మందిలో అస్తవ్యస్త ఆలోచనలు, మతిమరుపు, ఏకాగ్రత లోపం, కుంగుబాటు కనిపించాయని స్టాన్‌ఫోర్ట్‌ ప్రొఫెసర్‌ టోనీ కోరే తెలిపారు. అయితే ఈ వ్యాధితో చనిపోయిన వారి మెదడులో సార్స్‌-కోవ్‌-2 సంకేతాలు ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. ‘‘తీవ్రమైన కొవిడ్‌-19తో చనిపోయిన రోగులకు నాడీ సంబంధిత జబ్బులు లేకపోయినా.. మెదడులో వాపు ప్రక్రియకు సంబంధించిన కణ సూచీలు కనబడ్డాయి’’ అని కోరే తెలిపారు. వీరి పరిశోధనను ‘జర్నల్‌ నేచర్‌’ ప్రచురించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని