Satyendar Jain: మనీలాండరింగ్‌ కేసు.. దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు బెయిల్‌ నిరాకరణ

నగదు అక్రమ చెలామణీ(Money laundering) కేసులో దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain)కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30న...

Published : 18 Jun 2022 13:27 IST

దిల్లీ: నగదు అక్రమ చెలామణీ(Money laundering) కేసులో దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain)కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30న జైన్‌ను ఈడీ(ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా.. దానిని జూన్ 13 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఈ క్రమంలోనే గత మంగళవారం జైన్‌ బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్.. తుది ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేశారు. నేడు బెయిల్‌ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువడింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గత నెలలో ఆయన్ను అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని