ISRO: పొదుపు మంత్రం ఒక్కటే సరిపోదు.. భారీ రాకెట్లు అవసరం: ఇస్రో మాజీ చీఫ్‌ శివన్‌

అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో భారత్‌ దూసుకెళ్తున్నప్పటికీ.. భవిష్యత్తులో భారీ రాకెట్లు అవసరమని ఇస్రో మాజీ ఛైర్మన్‌ కే శివన్‌ (K Sivan) అభిప్రాయపడ్డారు.

Published : 18 Aug 2023 19:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్ష పరిశోధనల్లో (Space exploration) ఎంతో పురోగతి సాధిస్తోన్న భారత్.. తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలను చేపడుతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఓ హాలీవుడ్‌ సినిమా బడ్జెట్‌ కన్నా తక్కువ వ్యయంతోనే అంగారక మిషన్‌ (Mission Mangalyaan) చేపట్టి తన సత్తా చాటుకుంది. ఇలా అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో దూసుకెళ్తున్నా.. భవిష్యత్తులో భారీ రాకెట్లు అవసరమని ఇస్రో మాజీ ఛైర్మన్‌ కే శివన్‌ (K Sivan) అభిప్రాయపడ్డారు. జాబిల్లిపై దిగేందుకు చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో శాస్త్రవేత్త ఈ విధంగా మాట్లాడారు.

‘మనకు భారీ సామర్థ్యం కలిగిన రాకెట్లతో పాటు పెద్ద వ్యవస్థలు అవసరం. కేవలం పొదుపు ఇంజినీరింగ్‌తో మనుగడ సాధించలేం. అత్యాధునిక సాంకేతికతతోపాటు అత్యంత శక్తిమంతమైన రాకెట్లు అవసరం. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల ఓ మంచి పనిచేసింది. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది’ అని కే శివన్‌ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ప్రైవేటు రంగం ఆసక్తి చూపుతోందని.. ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని అన్నారు. త్వరలోనే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.

Mangalyaan: 6 నెలలు అనుకుంటే.. 7 ఏళ్లు దాటేసింది..!

తొలిసారి మనిషిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ‘గగన్‌యాన్‌ మిషన్‌’తో భారత అంతరిక్ష ఆశయాలు మరింత ఊపందుకుంటాయని ఇస్రో మాజీ చీఫ్‌ శివన్‌ పేర్కొన్నారు. ఈ సాంకేతికత నిరూపితమైన తర్వాత.. స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం, చంద్రుడిపై శాశ్వత ఆవాసం, ఇతర అంశాల గురించి ఆలోచించవచ్చన్నారు. భారత్‌ ఇప్పటికే అత్యంత శక్తిమంతమైన క్రయోజెనిక్‌ ఇంజిన్లను తయారు చేసిందని.. అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. స్పేస్‌ ఎక్స్‌ మాదిరిగా పునర్వినియోగ రాకెట్లపై భారత్‌ ప్రయత్నాలు చేస్తుందా..? అన్న ప్రశ్నకు కే శివన్‌ బదులిచ్చారు. ప్రస్తుతం నిట్టనిలువు ల్యాండింగ్‌ ప్రక్రియపై ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని