US: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం
రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలిరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్‌లో పుట్టిన రోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్న కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి ప్రవేశించిన వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు వివరించారు.
అటు ఉడ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి ఇరుగుపొరుగువారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితుడు ఆ ఇంటికి నిప్పంటించినట్లు తెలిపారు. అనంతరం ఎదురుకాల్పుల్లో నిందితుడు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi:మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
-
Sports News
Team india: ఆ ఇద్దరిలో ఎవరిని తుదిజట్టులో ఆడిస్తారో.. : మాజీ క్రికెటర్
-
Politics News
Revanth Reddy: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం!
-
Movies News
Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
-
India News
సోనియాకు మళ్లీ పాజిటివ్.. ఐసోలేషన్‌లో కాంగ్రెస్ అధినేత్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం