Chhota Rajan: ఎయిమ్స్‌లో చేరిన అండర్‌ వరల్డ్‌ డాన్‌!

తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ను అధికారులు దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు......

Published : 30 Jul 2021 01:10 IST

దిల్లీ: తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ను అధికారులు దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని మంగళవారం ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు జైలు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రోజు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, అతడిని డిశ్చార్జి చేసే విషయంలో ఇంతవరకూ అధికారిక సమాచారం ఏమీ లేదన్నారు. 61 ఏళ్ల ఛోటా రాజన్‌కు ఏప్రిల్‌లో కరోనా సోకడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో అతడు కరోనాతో మృతిచెందినట్టు కూడా పుకార్లు వచ్చాయి. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆ తర్వాత జైలు అధికారులు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అతడిని తిహాడ్‌ జైలుకు తరలించారు. 2015లో ఇండోనేషియాలోని బాలి నుంచి అతడిని బహిష్కరించినప్పటి నుంచి భారీ భద్రతతో కూడిన జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని