యూపీలో ఘోర ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కనౌజ్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 21 మందిని సురక్షితంగా బయటకు...

Updated : 11 Jan 2020 04:59 IST

ట్రక్కును బస్సు ఢీకొనడంతో మంటలు

  20 మందికి పైగా మృతి!

కన్నౌజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిలోయి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కాన్పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మోహిత్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఫరుఖాబాద్‌ నుంచి 45 మంది ప్రయాణికులతో జైపుర్‌ బయల్దేరిన ఏసీ బస్సు... చిలోయి వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ధాటికి మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. పోలీసులు 21 మందిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అయితే 20 మందికిపైగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వాహనాలు బలంగా ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంకు పగిలి భారీగా మంటలు విస్తరించి ఉండొచ్చని వారు చెప్పారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని