
కాబూస్‌కు నివాళిగా జాతీయ సంతాప దినం
దిల్లీ: ఒమన్ పాలకుడు సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ మృతికి నివాళిగా భారత ప్రభుత్వం జనవరి 13న జాతీయ సంతాప దినంగా పాటించనుంది. ఈ మేరకు హోంశాఖ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను అవనతం చేయాలని.. అధికారికంగా ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు జరపకూడదని గుర్తుచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది. కాబూస్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఒమన్ దేశ పాలకుడు సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వయసు 79 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆధునిక అరబ్ ప్రపంచ నిర్మాతగా ఆయనకు పేరుంది. 1970లో తన తండ్రిని పదవి నుంచి తొలగించి 29 ఏళ్లకే అధికారం చేజిక్కించుకున్న కాబూస్ అప్పటి నుంచి నిరాటంకంగా అయిదు దశాబ్దాల పాటు పాలన కొనసాగించారు. నూతన సుల్తాన్‌గా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి హైతమ్ బిన్ తారిక్ (65) ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రభుత్వం ట్వీట్ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.