Published : 19 Jan 2020 12:56 IST

అరెస్టు చేయలేనంత ‘అతిపే..ద్ద’ ఉగ్రవాది

మోసుల్‌: ఉగ్రసంస్థ ఐసిస్‌కు చెందిన ‘అతిపే..ద్ద ఉగ్రవాదిని ఇరాక్‌ బలగాలు అరెస్టు చేశాయి. ఇక్కడ అతిపెద్ద అంటే ఆ సంస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి కాదండోయ్‌! ఇక్కడ పెద్ద అంటే స్థూలకాయుడు అని. 560 పౌండ్లు (సుమారు 250కిలోలు) ఉన్న ఓ ఐసిస్‌ ఉగ్రవాది ఓ ఇంట్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో ఇరాక్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ, అతని ఆకారాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. కారులో ఎక్కించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక చేసేది లేక ఓ పికప్‌ ట్రక్కును తీసుకొచ్చి జైలుకు తరలించారు. అక్కడి పోలీసుల వివరాల ప్రకారం.. ముఫ్తీ అబు అబ్దుల్‌ బారీ అనే ఐసిస్ ముష్కరుడు.. విద్వేష ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. యువతను ఐసిస్‌ సానుభూతిపరులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐసిస్‌లో చేరి తదనంతర కాలంలో వ్యతిరేకంగా మారిన వారిని చంపేయాలని అబు ‘ఫత్వా’లు కూడా జారీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇతడిని ‘జబ్బా ది జిహాదీ’గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని