చివరి శ్వాస వరకూ దిల్లీ కోసం పనిచేస్తా: మోదీ

దేశ రాజధాని దిల్లీకి దిశానిర్దేశం చేసే ప్రభుత్వం కావాలని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం తెలిపారు. దిల్లీ శాసనసభా ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.

Published : 05 Feb 2020 00:41 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీకి దిశానిర్దేశం చేసే ప్రభుత్వం కావాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. దిల్లీ శాసనసభా ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ ద్వేష రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికలు ఈ దశాబ్దానికే తొలి ఎన్నికలని తెలిపారు. ఈ దశాబ్దం భారతదేశానిదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే భాజపా అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలు నేడు తీసుకునే నిర్ణయాలపైనే భారతదేశ భవిష్యత్ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా వేలాది మందికి చేరువైందన్నారు. భాజపా ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలు, మహిళల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. అరవింద్‌ కేజ్రీవాల్‌కు దిల్లీ ప్రజల పట్ల శ్రద్ధ లేకపోవడం వల్లే వారు ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి దూరమవుతున్నారన్నారు. దిల్లీకి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అవసరం ఉందని పేర్కొన్నారు. సీఏఏ ఆందోళనల పేరుతో నిరసనకారులు చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దిల్లీ ప్రజలకు ర్యాపిడ్‌ రైలు మార్గాల్ని, మరిన్ని జాతీయ రహదారుల అందించడం కోసం భాజపా పనిచేస్తోందని.. అదేవిధంగా తన చివరి శ్వాస వరకు దిల్లీ ప్రజల కోసం పనిచేస్తానని మోదీ సభా వేదికగా హామీ ఇచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని