సీఏఏపై నిరసనలో పాక్‌ అనుకూల నినాదాలు

కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ యువతి కలకలం....

Updated : 21 Feb 2020 10:41 IST

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ యువతి కలకలం రేపింది. వేదికపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రసంగించిన వెంటనే ఓ యువతి వచ్చి పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసింది. దీంతో వెంటనే ఒవైసీ ఆమె మైక్‌ను తొలగించి.. ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.

బెంగళూరులో ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరుతో సీఏఏ వ్యతిరేకిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగించిన అనంతరం అమూల్య అనే ఓ యువతి వేదికపైకి ఎక్కి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది. వెంటనే ఒవైసీ ఆమె చేతుల్లోంచి మైక్‌ లాక్కున్నారు. అయినప్పటికీ ఆ యువతి అదేవిధంగా నినాదాలు చేస్తూనే ఉంది. దీంతో పోలీసులు ఆమెను వేదిక మీది నుంచి తీసుకెళ్లారు. దీనిపై ఒవైసీ స్పందిస్తూ... ‘‘ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆమె ఎవరో సంబంధం లేని వ్యక్తి. కార్యక్రమ నిర్వాహకులు సైతం ఆమెను ఆహ్వానించలేదు. మేమెప్పుడూ భారత్‌ కోసమే ఉంటాం. పాకిస్థాన్‌కు ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని