అమ్మ కావాలి.. అమ్మను చూడాలి

ఆసుపత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తూ.. ఓ నర్సు ఇంటికి దూరమైంది.. మూడేళ్ల ఆమె కుమార్తె తల్లి కోసం తల్లడిల్లింది. అమ్మ కావాలి.. అమ్మను చూడాలంటూ మారం చేసింది.. ఏం చెప్పి ఆ బిడ్డను ఓదార్చాలో తెలియని ఆమె భర్త చివరకు పాపను.. 

Updated : 09 Apr 2020 18:49 IST

బెంగళూరు: ఆసుపత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తూ.. ఓ నర్సు ఇంటికి దూరమైంది.. మూడేళ్ల ఆమె కుమార్తె తల్లి కోసం తల్లడిల్లింది. అమ్మ కావాలి.. అమ్మను చూడాలంటూ మారం చేసింది.. ఏం చెప్పి ఆ బిడ్డను ఓదార్చాలో తెలియని ఆమె భర్త చివరకు పాపను ఆసుపత్రి దగ్గరకు తీసుకొచ్చారు. తన కోసం కుమార్తె ఆసుపత్రికి వచ్చిందని తెలిసినా.. బిడ్డను హత్తుకోలేని, లాలించలేని పరిస్థితి. కరోనా మహమ్మారి భయంతో దూరం నుంచే పాపను చూసి కన్నీటి పర్యంతమయ్యింది. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తున్న సునంద.. ఇంటికి వెళ్తే తన వల్ల కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకుతుందనే భయంతో 15 రోజులుగా ఆసుపత్రిలోనే ఉంటూ సేవలందిస్తోంది. తల్లి కోసం కుమార్తె ఆసుపత్రికి వచ్చినా మాయదారి మహమ్మారి భయంతో దూరం నుంచే ఓదార్చింది. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ కాగా.. సీఎం యడ్యూరప్ప స్వయంగా సునందకు ఫోన్‌ చేసి ఆమె సేవలను ప్రశంసించారు. సునందలానే జీవితాల్ని పణంగా పెట్టి సేవలందిస్తున్న నర్సులందరికీ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని