బ్రిటన్‌ మహారాణికీ కరోనా ఎఫెక్ట్‌

ఈ విధంగా జరగటం క్వీన్‌ ఎలిజబెత్‌ సింహాసనాన్ని అధిష్టించిన 68 సంవత్సరాల్లో ఇదే తొలిసారి.

Published : 21 Apr 2020 21:37 IST

ఇలా జరగటం 68 ఏళ్లలో ఇదే తొలిసారి

లండన్: బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజెబెత్‌-2 మంగళవారం 94వ జన్మదినోత్సవం జరుపుకొంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కూడా కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్‌ కొనసాగుతోంది. ఇక సామాజిక దూరాన్ని పాటించాలన్న నిబంధనకు అనుగుణంగా తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా 72 ఏళ్లుగా తన జీవిత భాగస్వామి అయిన ప్రిన్స్‌ ఫిలిప్‌, కుటుంబ సభ్యులతో కలసి తన అధికారిక నివాసం విండ్సర్‌ క్యాజిల్‌లో జన్మదినాన్ని జరుపుకొన్నారు. 

బ్రిటన్‌ రాజ్యాధినేత గౌరవార్ధం సమర్పించే తరతరాల సంప్రదాయమైన ‘21 గన్‌ సెల్యూట్‌‌’ కార్యక్రమాన్ని  కూడా ఈ సారి రద్దు చేశారు. ఈ విధంగా జరగటం క్వీన్‌ ఎలిజబెత్‌ సింహాసనాన్ని అధిష్టించిన 68 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ప్రపంచాన్ని కొవిడ్‌-19 పట్టిపీడిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో, గన్‌ సెల్యూట్‌ను అందుకొనేందుకు తనకు మనస్కరించలేదని ఈ సందర్భంగా రాణి తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని