వారికి తప్ప అందరికి కనిపిస్తుంది: సోనియా

వలసకార్మికులు పడుతున్న ‘తీవ్రమైన బాధ’ను దేశం మొత్తం చూస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు.

Published : 28 May 2020 13:55 IST

దిల్లీ: వలసకార్మికులు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. వారి కష్టం ఇంకా ప్రభుత్వం దృష్టికి చేరినట్లు లేదని విమర్శించారు. వలస కార్మికుల సమస్యలపై గరువారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వీడియో సందేశంలో సోనియా మాట్లాడుతూ..‘వారి బాధను అందరూ చూశారు. వారు ఏడుపులు విన్నారు. కానీ ప్రభుత్వం అవన్నీ ఇంకా చూసినట్లు లేదు. రానున్న ఆరు నెలల కాలానికి ప్రతి పేద కుటుంబానికి కేంద్రం రూ.7,500 అందించి ఆదుకోవాలి. అలాగే ఇళ్లకు చేరుకోడానికి సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలి’ అని కోరారు. లాక్‌డౌన్‌లో పేదలు, వలస కార్మికులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను ‘స్పీక్‌అప్’ క్యాంపైన్ ద్వారా పార్టీ  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది. ఈ వీడియో కూడా దానిలో భాగమే. 

ఇదిలా ఉండగా, వలస కార్మికులకు ఆహారం, షెల్టర్ కల్పించాలని, రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్ వలస కార్మకులకు పెను శాపంగా మారింది. నగరాల్లో ఉపాధి కోల్పోయి, తిండి, నిలువ నీడ లేక అగచాట్లు పడుతున్నారు. కొందరు నానా తంటాలు పడి ఇంటికి చేరుకుంటున్నారు. వారి తరలింపునకు ప్రభుత్వాలు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా పరిస్థితిలో మార్పులేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని