ఇక చైనా ట్వీట్లపై ఫ్యాక్ట్‌చెక్‌!

ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కామెంట్లపై ట్విటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా చైనా అధికారిక కామెంట్లపై ట్విటర్ ఫ్యాక్ట్‌చెక్‌ మొదలుపెట్టింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ అమెరికాపై ట్విటర్‌లో చేసిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్‌ మార్క్‌ విధించింది.

Published : 29 May 2020 13:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కామెంట్లపై ట్విటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా చైనా అధికారిక కామెంట్లపై ట్విటర్ ఫ్యాక్ట్‌చెక్‌ మొదలుపెట్టింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ అమెరికాపై ట్విటర్‌లో చేసిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్‌ మార్క్‌ విధించింది. చైనాకు కరోనా వైరస్‌ను అమెరికా మిలటరీనే తీసుకొచ్చిందంటూ ఝావో లిజియన్‌ మార్చి నెలలో ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన వాస్తవాన్ని తెలుసుకోవాలని ‘గెట్‌ ది ఫ్యాక్ట్స్‌ ఎబౌట్‌ ఇట్’ అని ట్విటర్‌ యూజర్లకు సూచించింది. కొవిడ్‌-19 ల్యాబ్‌లో సృష్టించింది కాదు.. ఇది జంతువుల నుంచి వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని దానికి జతచేసింది.

ఇదిలా ఉండగా.. తొలిసారిగా అమెరికా అధ్యక్షుడి కామెంట్లపై ట్విటర్‌ చేపట్టిన ఫ్యాక్ట్‌చెక్‌పై ట్రంప్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సామాజిక మాధ్యమాలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై త్వరలోనే అమెరికా అధ్యక్షుడు సంతకం చేస్తారని వైట్‌హౌజ్‌ వెల్లడించింది. ఇక ట్విటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ ప్రక్రియను ఫేస్‌బుక్‌ సీఈఓ జూకర్‌బర్గ్‌ కూడా తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాలు నిజనిర్ధారకులుగా ఉండకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ట్విటర్‌ సీఈఓ.. అసత్య సమాచారాన్ని ఎదుర్కోవడంలో భాగంగా తమ ఫ్యాక్ట్‌చెక్‌ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని