చిదంబరంపై ఈడీ ఛార్జిషీట్

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ఛార్జిషీటు దాఖలైనట్లు తెలుస్తోంది.

Updated : 03 Jun 2020 15:27 IST

దిల్లీ: ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా’ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఇ-ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు  వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించిన తొలి అభియోగపత్రం ఇది. కాగా, 2007  చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్‌ మీడియా సంస్థలోకి విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్లడానికి సహకరించారని, దాని నుంచి కార్తి చిదంబరం లబ్ధి పొందారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తూ.. కేసులు నమోదు చేశాయి. పెట్టుబడుల తరలింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో 2017లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దానిలో చిదంబరం పేరును కూడా చేర్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆ మరుసటి ఏడాది ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు చెందిన ఇంద్రాణీ ముఖర్జియా, పీటర్ ముఖర్జియాలు కూడా ఈ  కేసులో సహ నిందితులు. తరవాత ఇంద్రాణీ ఆప్రూవర్‌గా మారారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని